ఆదోని పట్టణంలోని ఫుడ్ కమిషనర్ తన కీలు|

0
0

ఆదోని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.అలాగే విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి,DSF విద్యార్థి సంఘం పోరాటానికి ఆదోని పట్టణానికి వచ్చిన AP ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ సార్ గారిని DSF బృందం కలవడం జరిగింది.DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని హాస్టల్ భవనాలు కళాశాలలకు దూరంగా ఉండటంతో విద్యార్థులు ప్రతిరోజూ కళాశాలలకు వెళ్లడానికి, తిరిగి హాస్టల్‌కు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది.కావున విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలలకు దగ్గరలోనే హాస్టల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రస్తుతం ఉన్న హాస్టల్స్‌లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, పరిశుభ్రత వంటి సౌకర్యాలు కల్పించాలి.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘంగా కోరుతున్నాము.