జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రెడ్డి గౌని రెడ్డప్ప, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం లను నియమిస్తూ ఉత్తర్వు పత్రాలను అందించారు. పుంగనూరు మండలం దిగువపల్లి గ్రామం కి చెందిన రెడ్డప్ప, బత్తలాపురం గ్రామంకి చెందిన ఎం సుబ్రహ్మణ్యం బీసీల పక్షాన నిలబడి బీసీల సమస్యలపై చేసిన పోరాటాలు, సేవలను గుర్తించి, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు షణ్ముగం తెలిపారు
#కొత్తూరు మురళి.










