అక్రమ స్టెరాయిడ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్.|

0
6

“6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు స్వాధీనం”

హైదరాబాద్,జూలై 4:హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించినట్లు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) గైక్వాడ్ రఘునాథ్, ఐపీఎస్ తెలిపారు.

సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ముషీరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

నిందితులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు కొనుగోలు చేసి జిమ్‌లకు వచ్చే యువతకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని డీసీపీ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు.

దాడుల్లో 440 స్టెరాయిడ్ వయల్స్, 336 ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్, సోమాట్రోపిన్, డ్రోస్టానోలోన్ తదితర స్టెరాయిడ్ మందులు, 336 సప్లిమెంట్ టాబ్లెట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని తెలిపారు.

దాడుల్లో 440 స్టెరాయిడ్ వయల్స్, 336 ఇంజెక్షన్లు, టెస్టోస్టెరాన్, సోమాట్రోపిన్, డ్రోస్టానోలోన్ తదితర స్టెరాయిడ్ మందులు, 336 సప్లిమెంట్ టాబ్లెట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని తెలిపారు.

నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీసీపీ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు.

#Sidhumaroju