మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ|

0
1
ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.

ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు. ఈ సందర్భంగా వారితో శింగనమల నియోజకవర్గానికి సంబంధించిన‌ పలు అభివృద్ధి ప‌నులు, సమస్యల గురించి ప్రస్తావించారు, ముఖ్యంగా వెస్ట్ నరసాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం గురించి వినతి పత్రం అందజేశారు. అలాగే, నియోజవర్గ వ్యాప్తంగా ఉన్న బాలికల పాఠశాలలో వాష్ రూమ్స్ అభివృద్ధితో పాటు ఇతర పాఠశాలలో లోనెలకొన్న చిన్న చిన్న సమస్యల గురించి మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు .

వీటితోపాటు ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి లోకేష్ గారికి వివరించారు.