విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి|

0
1

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు, గూడూరు జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ సునంద, గూడూరు ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి పాల్గొని.. మహిళల భద్రత, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలతో పాటు షీ టీం, భరోసా కేంద్రాల సేవలపై అవగాహన కల్పించారు.

ఆపద సమయంలో డయల్ 100/112, సైబర్ మోసాలకు 1930, మరియు షీ టీం (8712656935) నెంబర్లను సంప్రదించి సాయం పొందాలని సూచించారు. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుజాత, సత్యనారాయణ, ఉపాధ్యాయులు, 300 మంది విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.