ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.
2025-26 విద్యా సంవత్సరంలో దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం దర్శి పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టిడిపి ఇన్‌చార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు విద్యార్థులను అభినందిస్తూ, విద్యే జీవితంలో శాశ్వత సంపద అని పేర్కొన్నారు.
ప్రథమ బహుమతి – రూ.10,000
ద్వితీయ బహుమతి – రూ.5,000
కీ.శే. కొండేటి నరసింహులు – శ్రీమతి రోశమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, సినీ నిర్మాత కొండేటి చిన్న నరసింహారావు గారు ఈ బహుమతులను అందజేయడం అభినందనీయమని డా. లక్ష్మీ గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
మన జీవితంలో చేసే అత్యుత్తమ పెట్టుబడి విద్య.
విద్యకు మించిన సంపద మరొకటి లేదు.
పేద విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉంది.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి విజయాన్ని సాధించాలి.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు










