పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం|

0
0

పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఆ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న రైతులు, వ్యాపారులు, భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడున్న రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు# కొత్తూరు మురళి.