పెద్దమండ్యం చెరువు కట్టపై కోళ్ల వ్యర్థాలు.|

0
0

మదనపల్లె–తంబళ్లపల్లె మార్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీప చెరువు కట్ట వద్ద కోళ్ల వ్యర్థాలను విచ్చలవిడిగా పారబోస్తుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వ్యర్థాలను తొలగించి, ఇకపై అక్కడ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.