నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన|

0
3

 

 

‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు భూ హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా, బేతంచర్ల మండలం గుటుపల్లిలోని 897 మంది రైతుల 2074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూములను ఆన్‌లైన్‌లో నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతులకు హక్కు పత్రాలను సీఎం స్వయంగా అందజేయనున్నారు. చుక్కల భూముల సమస్య పరిష్కారంతో పాటు, రైతులు తమ భూములపై అమ్ముకునే హక్కు, రుణ సౌకర్యం పొందే వెసులుబాటు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.