గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌లో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ|

0
0

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 

హిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళల ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు ఐవీఆర్ఎస్ ఫిర్యాదులపై సమర్థవంతంగా స్పందించాలని సూచించారు.

 

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రాఘవరెడ్డి, ఎస్సై రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.