కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన మాజీ సర్పంచ్, టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్పపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదోని సీఐ నల్లప్పకు వారు ఫిర్యాదు చేశారు.
పాఠశాల స్థల పరిరక్షణ కోసం చట్టబద్ధంగా అధికారులను ఆశ్రయించిన తమను, శివప్ప మీడియా ముఖంగా కాళ్లు, చేతులు నరుకుతామని బెదిరించారని, పూర్వ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని పోరాడుతున్న తమకు రక్షణ కల్పించి, శివప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.










