పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ను ఆలయ అర్చకులు ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకించి సుగంధ ద్రవ్యాలతో ఫల పుష్పాలతో పసుపు అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు
#కొత్తూరు మురళి.










