🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు… అధికారులకు కనిపించడం లేదా? 🚨
మునిసిపాలిటీ అధికారులకు సంబంధిత అధికారులకు ఇది కనిపించలేదా??
వీరికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా లేక ఇంకేమైనా ముడుతున్నాయా అని వాపోతున్న స్థానికులు..
🔥 “మమ్మల్ని అడిగేది ఎవరు?” అన్నట్లుగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
📍 కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్లోని చిట్వేల్ రోడ్డుపై కొన్ని హోటల్ యజమానులు బహిరంగంగా రోడ్డుపైనే వంటలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
💨 వంటల నుంచి వచ్చే పొగ, మంటల కారణంగా చిట్వేల్, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పొగతో కళ్లు మండిపోతూ, ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
❓ ఆటోలు, ఇతర వాహనాలు రోడ్డుపై ఆగితే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు… రోడ్డుపైనే జరుగుతున్న ఈ వంటలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
⚠️ ప్రజల ప్రాణాల కంటే నిబంధనలు ముఖ్యమా? లేక కొందరి ఇష్టారాజ్యమే చట్టమా?
👉 సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై జరుగుతున్న వంటలను నిలిపివేసి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.










