బనగానపల్లిలో ఘనంగా “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం|

0
1

నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మన ప్రజలకు సంబంధించిన భూ సమస్యల శాశ్వత పరిష్కారం, మరియు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై గౌరవ సీఎం గారితో సుదీర్ఘంగా చర్చించాను.

మన నియోజకవర్గ ప్రగతికి ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆళ్లగడ్డను అన్ని రంగాల్లో మరింత ముందంజలో నిలిపేందుకు, మరిన్ని నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను. మన ఆళ్లగడ్డ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రస్థానం ఇలాగే కొనసాగుతుంది.