గుంటూరులో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్: 720 చలానాలు నమోదు|

0
1

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. బ్లాక్ స్పాట్లు, ఇతర కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 720 చలానాలు నమోదు చేసి రూ.4,74,080 జరిమానా విధించారు. ప్రధానంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారు, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో సుమారు 720 మంది వాహనదారులు, విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ స్పెషల్ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.