ఇంగళదహాల్ BC హాస్టల్‌లో ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు వార్డెన్లను మార్చడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకే వార్డెన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఆదివారం ఆదోనిలోని BC హాస్టల్‌లో వార్డెన్లు విధులకు గైర్హాజరు కావడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమే. దీనిపై డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ABCWO అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) డిమాండ్ చేస్తోంది. ప్రతి హాస్టల్‌కు శాశ్వత ప్రాతిపదికన ఒకే వార్డెన్‌ను నియమించి, విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్ల తీరుపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి.










