బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు… ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలను శుభ్రపరిచి, అక్కడ మద్యం సేవించడం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. బహిరంగ మద్యం సేవించడం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడైనా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.










