Madanapalle: మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్‌లో తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు.|

0
2

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని తట్టివారిపల్లి జంక్షన్ వద్ద తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేని వారు, ఓవర్‌లోడ్‌తో ఆటోలు నడిపిన డ్రైవర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు.

 

ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవడం, ఆటో డ్రైవర్లు ప్రయాణికులను పరిమిత సంఖ్యలో మాత్రమే ఎక్కించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్సై రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.