అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లాల జూనియర్ బాలుర ఫుట్ బాల్ పోటీలలో భాగంగా, సోమవారం వైజాగ్ – కర్నూలు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.










