గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేదిక ద్వారా మహిళలు తమ వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలను స్వేచ్ఛగా విన్నవించుకుంటున్నారు. గంజాయి కట్టడి, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు, ఆకతాయిల వేధింపుల వంటి సమస్యలను ఆమె అధికారులతో సమన్వయం చేసుకుంటూ సత్వరమే పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల సర్టిఫికెట్ల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, పుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. మహిళల భద్రతే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేస్తున్నామని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.










