సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|

0
4

– లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

– గడువులోగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

– నాణ్యతలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు సూచన

మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 19: ఆల్వాల్ లోత్‌కుంటలోని లక్ష్మీనగర్‌లో కొనసాగుతున్న సీవరేజ్ లైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించిన ఆమె, కాంట్రాక్టర్‌తో మాట్లాడి నిర్మాణ పనుల వేగంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. మిగిలిన పనులను వేగవంతం చేస్తూనే నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

సీవరేజ్ లైన్ నిర్మాణ పనులు పూర్తయితే స్థానికులకు మెరుగైన మురుగునీటి పారుదల సౌకర్యం అందుబాటులోకి వస్తుందని శాంతి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

పనులు సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత వర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

#Sidhumaroju

Alwal