🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి (ప్రజా ఫిర్యాదుల విభాగం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులను జిల్లా ఎస్పీ నితికా పంత్ స్వయంగా కలిసి, వారి సమస్యలను మరియు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు.బాధితుల నుండి అందిన వినతులపై ఎస్పీ తక్షణమే స్పందించారు. ఆయా సమస్యలను చట్టప్రకారం, అత్యంత వేగంగా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కొన్ని అత్యవసర కేసులకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఆమె ఫోన్లో నేరుగా మాట్లాడి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచనలు జారీ చేశారు.న్యాయం మరియు సహాయం కోసం ప్రజలు ఎలాంటి మధ్యవర్తులను, పైరవీకారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా నేరుగా పోలీస్ సేవలను ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.









