ఆసిఫాబాద్ సర్వజన ఆసుపత్రిలో అజ్మీరా శ్యామ్ నాయక్ పరిశీలన|

0
10

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జిగ్కాం ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు బుధవారం ముమ్మరంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను వ్యక్తిగతంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ మరియు సిబ్బందితో సమావేశమయ్యారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు, ఉచిత ల్యాబ్ పరీక్షలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని, ఆసుపత్రిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాశన్న, సీనియర్ లీడర్ నిజం, మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.