కరీంనగర్ సీతారాంపూర్‌లోని ఐవీవై (IVY) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షా శిబిరం ఘనంగా జరిగింది. డిజిటల్ పరికరాల వాడకంతో తలెత్తే కంటి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు చైర్మన్ పసుల మహేష్ తెలిపారు. ఇదే క్రమంలో జూలై 22 జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శివకాంత్ రెడ్డి, బట్టు వినోద్, కృష్ణ చైతన్య, చైర్మన్ మహేష్ చేతుల మీదుగా జ్ఞాపికలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో కంటి సంరక్షణతో పాటు దేశభక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వారు కొనియాడారు.










