ఆసిఫాబాద్‌లో నీట్ లీకేజీపై పీడీఎస్‌యూ నిరసన.. బంద్‌కు పిలుపు|

0
3

నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఎన్టీఏ (NTA)ను రద్దు చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జ. తిరుపతి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని, సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు అయ్యూబ్ ఖాన్, సమీర్, తరుణ్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.