లింగాపూర్, సిర్పూర్(యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ తనిఖీ|

0
25

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పారదర్శక, నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ గారు.. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు 24 గంటల పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో నాణ్యత పాటిస్తూ జనరల్ డైరీ (GD), డ్యూటీ పాస్ పోర్ట్, CCTNS ఎంట్రీలను ఎప్పటికప్పుడు సమయానికి పూర్తి చేయాలని, అలాగే స్టేషన్లలోని సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి పారదర్శకంగా దర్యాప్తు జరపాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలతో పాటు సమాజానికి హాని కలిగించే గుట్కా, గుడుంబా, జూదం, మట్కా, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.