నారాయణపేట జిల్లాలో దారుణ| 

0
5

నారాయణపేట జిల్లాలో నగల కోసం ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాదరవ్ పల్లికి చెందిన శాంతమ్మ అనే మహిళ పది రోజుల క్రితం అదృశ్యమైంది. కాగా, నారాయణపేట మండలం జాజాపూర్ శివారులోని చెట్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలు అపహరించిన దుండగులు, కేవలం ఆ నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.