మంత్రిని తొలగించకపోతే ప్రధాని రాజీనామా కోరుతాం: CJP|

0
3

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో ప్రధాని మోడీ రాజీనామా కోసం ఉద్యమిస్తామని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక విఫల మంత్రి ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి రాజీనామాకు ఆయన పట్టుబట్టారు. మరోవైపు, ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చర్చలకు ఆహ్వానించారు. జేపీ నడ్డా నివాసంలో చర్చలకు రావాలని కోరారు. అయితే, సీజేపీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రభుత్వం జంతర్ మంతర్ లేదా కానిస్టిట్యూషన్ క్లబ్ లాంటి తటస్థ వేదిక వద్దకు వచ్చి చర్చలు జరపాలని స్పష్టం చేసింది. చర్చలకు ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలనే ప్రధాన షరతును సీజేపీ ముందు ఉంచింది.