ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు బాసటగా ఎమ్మెల్సీ విఠల్|

0
12

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో అటవీ అధికారుల వేధింపులకు గురవుతున్న గిరిజన పోడు రైతులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ స్వయంగా పరామర్శించారు. ఆయన ట్రాక్టర్‌పై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అటవీ, రెవెన్యూ అధికారులతో చర్చించి, తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనుల హక్కులను కాలరాయొద్దని, వారిని సాగు చేసుకోకుండా అడ్డుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. గిరిజనుల హక్కులను కాపాడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని, వారి భూముల జోలికి వస్తే ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జోక్యంతో గిరిజనులు యథావిధిగా సాగు చేసుకునేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతో సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్సీ దండే విఠల్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.