Guru pournami|

0
1

*అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు!*

✴️ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గురువులందరికీ హృదపూర్వక నమస్సుమాంజలులు తెలిపారు.

 

✴️ “గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవితాన్ని మలిచిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. గురువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వారి బోధనలను ఆచరిస్తే ప్రతి అడుగూ విజయానికి నాంది అవుతుంది” అని పేర్కొన్నారు.

 

✴️ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, గురువు జీవితానికి అర్థాన్ని, లక్ష్యాన్ని అందిస్తారని అన్నారు. జీవితానికి దిశానిర్దేశం చేసి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి మనలోని సామర్థ్యాన్ని గుర్తించి, క్రమశిక్షణ, విలువలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి అమూల్యమైన సంపదను ప్రసాదిస్తారని పేర్కొన్నారు.