రెండేళ్ల కూటమి పాలన: మదనపల్లెలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం|

0
0

Madanapalle: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో గౌరవ మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ భాషాతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లె రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.