కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలోని ముఖ్యాంశాలు:
-
ఇళ్ల కేటాయింపు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
-
ఆవాస్ ప్లస్ సర్వే: గత ప్రభుత్వం పదేళ్లుగా ఈ పథకాన్ని వాడుకోలేదని, ఆవాస్ ప్లస్ యాప్ సర్వే ప్రకారం రాష్ట్రంలో పేదల సొంత ఇళ్లకు తీవ్ర డిమాండ్ ఉందని వివరించారు.
-
అదనపు ఉపాధి పనులు: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పేదల జీవనోపాధి మెరుగుపరచడానికి ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’లో అదనపు పనులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
-
వ్యవసాయ అనుబంధ పనులు: కూరగాయల పందిళ్లు, పశుగ్రాసం పెంపకం, మల్బరీ సాగు, నీటి నిల్వ కందకాల నిర్మాణం వంటి పనులను ఇందులో చేర్చాలని సీఎం కోరారు.









