ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి|

0
1

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో, ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ ఎస్. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంత ప్రజలకు, పేద విద్యార్థులకు మెరుగైన వైద్యం, విద్యను అందించేందుకు టీచింగ్ ఆసుపత్రితో కూడిన మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలన్నారు. అలాగే ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల విద్యార్థుల కోసం నూతన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. మంత్రి లోకేష్ ఈ హామీలను నెరవేర్చి, పనుల కాలపట్టికను ప్రకటించకపోతే విద్యార్థులు, యువతతో కలిసి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలు చేపడతామని డివైఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు.