రాయచోటిలో ప్రజల ఆశీస్సులే రాముడు అన్నకు కొండంత బలం|

0
1

*రాయచోటి ప్రజల ఆశీస్సులే రాముడన్న కు కొండంత బలం*

*20 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తున్న నాయకుడు – టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్*

రాష్ట్ర రవాణా, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటి ప్రజల ఆశీస్సులే కొండంత బలమని టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అన్నారు. గత 20 ఏళ్లుగా పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రతి ఇంటికీ చేరువైన నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. రాయచోటి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రజల అభిమానమే ఆయనను మరింత ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ నాగార్జునరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఆకుల మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.