చంపిన హంతకులను పరామర్శిస్తారా?: జగన్ పర్యటనపై మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం.

0
1

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేసిన బైక్ యాక్సిడెంట్‌లో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన కేసులో అరెస్టయిన అప్పలరాజును వైసీపీ అధినేత జగన్ పరామర్శించడంపై ఏపీ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబాన్ని వదిలేసి, నిందితులను జగన్ పరామర్శించడం దారుణమని మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి మండిపడ్డారు.

 

 

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… “క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో చెప్పేందుకు జగనే ప్రత్యక్ష నిదర్శనం. గతంలో అనేక ప్రమాదాల్లో బాధితులను పట్టించుకోని జగన్.. ఇప్పుడు హంతకులకు, రౌడీలకు నేరుగా క్లీన్ చిట్ ఇస్తూ నేరస్తులకు వంతపాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.