ప్రపంచవ్యాప్తంగా భారత్ వాణికి గతంలో కంటే గౌరవం పెరిగిందన్న చంద్రబాబు
ప్రపంచ వేదికపై భారత్ నిర్మాణాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించిందన్న పవన్ కల్యాణ్
‘న్యూఢిల్లీ డిక్లరేషన్’తో కీలక అంశాలపై సహకారానికి మార్గం సుగమమైందని హర్షం
భారత్ విశ్వసనీయ వేదికగా నిలిచిందని ఇరువురు నేతల ప్రశంసలు
న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ స్వరం గతంలో కంటే ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో వినిపిస్తోందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
సోమవారం చంద్రబాబు ‘ఎక్స్ (ట్విట్టర్)’ వేదికగా స్పందిస్తూ, “ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్న ఈ సమయంలో, ప్రపంచంలోని కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చి భారత్ 18వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది” అని పేర్కొన్నారు.









