Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పూర్తి సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారం ఉత్సాహంగా సాగింది.

0
4

Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన రెండో రోజు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం మదనపల్లె నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.

 

ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా, బెల్లె రెడ్డి ప్రసాద్ ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బెల్లె రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.