తుంపల్లికి మోక్షమెప్పుడు.

0
2

కొందుర్గు మండలకేంద్రం నుంచి తూంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యతంగా మారింది. వర్షాల కారణంగా రొడ్డంతా పెద్ద పెద్ద గుంతలుగా మారి వర్షంనీటితో నిండిపోయాయి. వాహనదారులు, అత్యవసర సమయాల్లో ఆబులెన్స్ లు ఆ దారిగుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది.

ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ఏళ్ళు గడుస్తున్నా ఆ రోడ్డును బాగుచేయించే నాధుడే కరువయ్యారు. ఆ ఊరి ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదు. ఎన్నో ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇకనైనా సంబంధిత నాయకులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.