ఏపీలో 45 లక్షల ఓట్ల తొలగింపు.. ముసాయిదా జాబితా విడుదల|

0
0

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) భారీ మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ అనంతరం సుమారు 45 లక్షల ఓట్లను తొలగిస్తూ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వలస వెళ్లిన లేదా అందుబాటులో లేని 22.30 లక్షల మంది, మరణించిన 15.22 లక్షల మంది, డబుల్ ఎంట్రీలు ఉన్న 7.37 లక్షల మంది ఓట్లను తొలగించారు. జూన్ 15 నుండి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి విచారణ జరిపారు. రాష్ట్రంలోని 89.22% మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించారు. అందుబాటులో లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం వంటి కారణాలతో మిగిలిన 44.89 లక్షల మంది వివరాలు సేకరించలేకపోయామని ఆయన స్పష్టం చేశారు.