అందుబాటులోకి ‘ఫ్యామిలీ సర్టిఫికేట్’|

0
1

ప్రజా ప్రభుత్వం ‘ఫ్యామిలీ సర్టిఫికేట్’ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు తెలిపారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే ధృవీకృత పత్రంతో సులభంగా సమర్పించేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందన్నారు. సమీప తహసీల్దార్ కార్యాలయం లేదా మీ సేవ కేంద్రంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందవచ్చని, ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

‎ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ గారు తదితరులు పాల్గొన్నారు