బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామ ప్రజలు 4రోజులుగా నీటికొరతతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి మోటార్లు పాడైపోయి నెలలు గడుస్తున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. తాగునీటి అవసరాలకు స్కూల్ ట్యాంక్ నుంచి తీసుకెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి త్వరితగతిన మోటార్లు మరమ్మత్తులు చేసి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
#Boiena Rajesh










