రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం|

0
0

🎤భారత్ ఆవాజ్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఖాళీగా ఉన్న ఏ.ఎన్.ఎం (ANM) పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలాగే 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా వారు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన స్థానికులై ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే, ఇంటర్మీడియట్‌తో పాటు ఏ.ఎన్.ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వృత్తి విద్యా కోర్సులో జి.ఎన్.ఎం ట్రైనింగ్ లేదా బి.ఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను 07.08.2026 సాయంత్రం ఐదు గంటల లోపు కుమురం భీం ఆసిఫాబాద్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.