మోపాల్: రూ.10 లక్షల విలువైన LOCలు అందజేత

0
3

మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన వడమటి బాలయ్య, సిర్నూర్ గ్రామానికి చెందిన సత్తూరి శేఖర్ హైదరాబాద్ నిమ్స్ లో శస్త్రచికిత్స పొందుతున్నారు. వారి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల విలువైన రెండు LOCలను (వైద్య ఖర్చుల హామీ పత్రాలను) ఎమ్మెల్యే భూపతి రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.🙏🙏