ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణ మరియు వర్ధంతి వారోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్మారక జెండాను ఆవిష్కరించి, విప్లవ వీరుడు కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన మహా యోధుడు కుమురం భీం అని కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి, త్యాగాలు భావితరాలకు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. భీం ఆశయాల సాధనతో పాటు ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, మరియు సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ అట్టహాసమైన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అంకుసాపూర్ సర్పంచ్ టేకం గంగారాం, వగుడాం సర్పంచ్ జూగాదిరావ్, సమేలా సర్పంచ్ సంతోష్, మాజీ ఎంపీపీ మోతిరాం పాల్గొన్నారు. అలాగే డీసీసీ కార్యవర్గ సభ్యుడు పేందూర్ సుధాకర్, షిడం అర్జు, మాడవి రఘునాథ్, గురనులే నారాయణ, ఉప్పుల కృష్ణ, బాజీరావు, మారుతి, చందన్ షా మరియు జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










