ఆదాయపు పన్ను శాఖ ఫేక్ లింక్స్‌పై ఎస్పీ ధీరజ్ హెచ్చరిక|

0
0

మదనపల్లె: ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) శాఖ పేరుతో వాట్సాప్‌లో వస్తున్న నకిలీ నోటీసులు, సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ సూచించారు.

 

సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను శాఖ పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపుతూ, అందులో అనుమానాస్పద లింకులు లేదా .zip, .exe వంటి ఫైళ్లను జత చేస్తున్నారని తెలిపారు.

 

అలాంటి లింకులను క్లిక్ చేయడం లేదా ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యి, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదని స్పష్టం చేసిన ఎస్పీ, గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, వాటిలోని లింకులు, ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని ప్రజలకు సూచించారు.

 

ఎవరైనా ఇటువంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు.