ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు వద్ద ఘోర ఉదంతం చోటుచేసుకుంది. ఓ మాల్ వద్ద వాహనం నిలిపే క్రమంలో డాక్టర్ ప్రియాంకకు, ఇద్దరు యువకులకు నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను కారుతో బలంగా ఢీకొట్టి ఆపై ఆమెపైనుంచి కారును పోనిచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ధ్రువీకరించారు. ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య రంగానికి చెందిన సభ్యులపై ఇటువంటి హింసాత్మక దాడులు పెరిగిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.










