ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్
రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం
అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రభుత్వానికి సలహాలు
ఢిల్లీ కేంద్రంగా కొనసాగనున్న గోయల్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త సలహాదారును నియమించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి అశోక్ సీతారాం గోయల్‌ను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతారు. ఢిల్లీ కేంద్రంగా ఆయన తన విధులను నిర్వర్తించనున్నారు.
గోయల్ గతంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో ఎక్స్-అఫీషియో అదనపు కార్యదర్శిగా, నదుల నిర్వహణ విభాగంలో సభ్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆయనకు సుమారు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.










