Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.

0
0

 మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్ టార్చ్‌లు, ద్విచక్ర వాహనాల హెడ్‌లైట్ల వెలుతురులో రోగులకు వైద్యం అందిస్తున్న పరిస్థితులపై బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస పవర్ బ్యాకప్ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ.. రోగుల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయినప్పుడు సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం చేయడం, అంబులెన్స్‌లోకి రోగులను తరలించే సమయంలో బైక్ లైట్లను ఉపయోగించాల్సి రావడం ఆందోళనకరమన్నారు.