పెద్ది కుటుంబానికి అండగా నిలిచారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ భారీ ఆర్థిక సాయం ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.
వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున, తల్లికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కుటుంబానికి రూ.2.25 కోట్ల సహాయం అందనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల చదువు, వారి భవిష్యత్తు బాధ్యతలను కూడా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు పోస్టులు చెబుతున్నాయి.
కష్టాల్లో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పి, జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.










