లూప్‌లైన్‌లో ‘సూపర్ స్టార్’ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, స్మిత!|

0
1

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో తమదైన మార్కుతో డైనమిక్ ఐఏఎస్ అధికారులుగా వెలుగొందిన కాట ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ ప్రస్తుతం లూప్‌లైన్‌లోకి వెళ్లడం బ్యూరోక్రసీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ క్యాడర్‌కు కేటాయించబడిన ఆమ్రపాలి తెలంగాణలో కొనసాగేందుకు సుదీర్ఘ న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఏపీకి వెళ్లిన తర్వాత అక్కడ సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఆమె సుదీర్ఘ సెలవుల్లోకి వెళ్లారు. మరోవైపు, తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన స్మితా సబర్వాల్.. ప్రభుత్వం మారిన తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు, కొత్త పరిపాలనా ప్రాధాన్యతలకు తగ్గట్లుగా ఇమడలేకపోయారు. దీనితో ఆమె సైతం ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి అత్యంత సమర్థులైన అధికారులు రాజకీయ మార్పులు, క్యాడర్ నిబంధనల వల్ల క్రియాశీలక విధులకు దూరమై సెలవులకు పరిమితమవ్వడం ఇరు రాష్ట్రాల పాలనకు తీరని లోటని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు.